AP POLYCET 2025 Certificate Verification & Web Options Schedule – Processing Fee, Dates & Required Documents

AP POLYCET 2025 సర్టిఫికెట్ ధ్రువీకరణ & వెబ్ ఆప్షన్ షెడ్యూల్ – ఫీజు వివరాలు, తేదీలు, అవసరమైన సర్టిఫికెట్లు

📢 AP POLYCET 2025 అర్హత సాధించిన అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం

APPOLYCET-2025 ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి సర్టిఫికెట్ ధ్రువీకరణ మరియు వెబ్ ఆప్షన్ ఎంట్రీ షెడ్యూల్ విడుదలైంది. అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన తేదీలు, సూచనలు ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి.


💳 ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు (ఆన్‌లైన్ ద్వారా)

తేదీలు: 20.06.2025 నుండి 27.06.2025 వరకు

  • OC/BC అభ్యర్థులకు: ₹700/-

  • SC/ST అభ్యర్థులకు: ₹250/-

  • చెల్లించాల్సిన వెబ్‌సైట్: https://polycet.ap.gov.in/DefaultPage.aspx


📌 సర్టిఫికెట్ ధ్రువీకరణకు అవసరమైన పత్రాలు

తరువాత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీ హెల్ప్ లైన్ సెంటర్‌లో ఈ పత్రాలతో హాజరుకావాలి (అసలులు + 2 జిరాక్స్ ప్రతులు):

  1. ఫీజు చెల్లింపు రసీదు

  2. APPOLYCET-2025 హాల్ టికెట్

  3. APPOLYCET-2025 ర్యాంక్ కార్డ్

  4. 10వ తరగతి మార్క్స్ మెమో లేదా ఇంటర్నెట్ కాపీ

  5. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
    లేదా గత 7 సంవత్సరాల రెసిడెన్స్ సర్టిఫికెట్
    లేదా తల్లిదండ్రుల 10 ఏళ్ల రెసిడెన్స్ సర్టిఫికెట్ (APలో మాత్రమే)

  6. EWS సర్టిఫికెట్ (2025-26 కోసం)

  7. ఆదాయ ధ్రువీకరణ పత్రం (01.01.2022 తర్వాత జారీ చేసినది)

  8. కుల ధ్రువీకరణ పత్రం (BC/SC/ST అభ్యర్థులకి)

  9. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్

  10. లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ (అవసరమైతే)

  11. PWD/CAP/NCC/Sports/Scouts & Guides/Minority/Anglo-Indian పత్రాలు (అవసరమైతే)


📅 OC/BC/SC/ST అభ్యర్థుల కోసం సర్టిఫికెట్ ధ్రువీకరణ షెడ్యూల్

హాజరు సమయం: ప్రతిరోజూ ఉదయం 9:00 గంటలకు

తేదీ ర్యాంక్ పరిధి
21.06.2025 1 – 15000
22.06.2025 15001 – 32000
23.06.2025 32001 – 50000
24.06.2025 50001 – 68000
25.06.2025 68001 – 86000
26.06.2025 86001 – 104000
27.06.2025 104001 – 120000
28.06.2025 120001 – చివరి ర్యాంక్

 🎯 ప్రత్యేక ధ్రువీకరణ షెడ్యూల్ (ఉదయం 9:00)

తేదీ  విభాగం ర్యాంక్ పరిధి
25.06.2025 NCC, PWD 1 – 40000, అన్ని ర్యాంకులు
26.06.2025 Sports & Games, NCC 1 – 60000, 40001–80000
27.06.2025 Sports & Games, NCC 60001–చివరి, 80001–చివరి
28.06.2025 CAP, Scouts, Anglo-Indian 1 – చివరి ర్యాంక్

💻 వెబ్ ఆప్షన్ ఎంట్రీ షెడ్యూల్

తేదీలు ర్యాంక్ పరిధి
25.06.2025 – 26.06.2025 1 – 50000
27.06.2025 – 28.06.2025 50001 – 90000
29.06.2025 – 30.06.2025 90001 – చివరి ర్యాంక్
01.07.2025 ఆప్షన్ మార్పు (అన్ని ర్యాంకులు)

🎓 సీటు కేటాయింపు మరియు కాలేజ్ రిపోర్టింగ్
  • సీటు కేటాయింపు ఫలితాలు: 03.07.2025 సాయంత్రం 6 గంటల తర్వాత

  • వెబ్‌సైట్: https://polycet.ap.gov.in

  • లాగిన్: హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్, జన్మతేది ఉపయోగించండి


💰 ట్యూషన్ ఫీజు వివరాలు

  • ప్రభుత్వ/ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీకి: ₹4,700/-

  • ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీకి: ₹25,000/-

  • ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత:

    • SC/ST/BC: గరిష్ఠ వయసు 24 సంవత్సరాలు

    • OC: గరిష్ఠ వయసు 20 సంవత్సరాలు (01.07.2025 నాటికి)

    • ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం చెల్లింపులు జరుగుతాయి

Comments