వివేకానంద..ఓ స్ఫూర్తి..! ఆయన బ్రతికింది నలభై ఏళ్ళు మరణించి 123 సంవత్సరాలు.. -ఎలిశెట్టి సురేష్ కుమార్
వివేకానంద..ఓ స్ఫూర్తి..!
ఆయన బ్రతికింది నలభై ఏళ్ళు
మరణించి 123 సంవత్సరాలు..
అయినా నిర్మలమైన ఆ రూపు
ప్రశాంతమైన ఆ చూపు
యువతకు ఆయనిచ్చిన మేలుకొలుపు..
చికాగో ప్రసంగం నాటి ఊపు..
ఆ మైమరపు..
ఎప్పటికీ మాసిపోని
ఓ మెరుపు..
దుర్మార్గానికి చెరుపు
పెడదారి పట్టే యువతకు
జబ్బచరుపు..!
నరేంద్రనాథ్ దత్తా..
ఆయన వాగ్ధాటి ముందు
మహామహులే చిత్తా..
నేనెవరిని...
ఒకే శ్లేష..
సమ్మోహన భాష..
కోట్లాది ప్రజల
గుండె ఘోష..
అదే ప్రశ్న
ఆయనను చేర్చింది
గురువు చెంత..
తీరిన ఆత్మ చింత..
జగతికి చూపింది దారి కొంత..
చికాగోలో ఓ విస్ఫోటనం..
మతపెద్దల సంఘటనం..
నా ప్రియమైన
సోదరసోదరీమణులారా
అన్న ఒక్క సంబోధనం..
ప్రపంచ ఐక్యతకు ఇంధనం..
భారతీయతకు మూలధనం..
హిందూత్వ మానధనం..
మార్మోగిన వేదిక..
సామరస్యతకు సూచిక
విశ్వమానవ ఏకతాగీతిక..
వివేకానందుని కీర్తి పతాక..!
ఎన్నాళ్ళయినా..ఎన్నేళ్ళయినా
యువతకు స్ఫూర్తి వివేకానంద
అత్యద్భుత సందేశాల అలకనంద..
చదివి కొంతైనా మారితే
ఈ సమాజమనే గులివింద
స్వామికి అదే నిజమైన నివాళి
గోవింద..గోవింద..
మహనీయులకు సంబంధించి
రెండు ముఖ్యమైన రోజులు..
జయంతి..వర్ధంతి..
స్వామి ఘనమైన స్మృతి..
సెప్టెంబర్ 11..1893
జగతికి జాగృతి..!
స్వామి వివేకానంద
చికాగో అద్భుతం
సందర్భంగా జేజేలు..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286
Comments
Post a Comment