🚦 Learner’s Licence (LLR) Test Questions and Answers in Telugu Model Paper - 2

🚦 Learner’s Licence (LLR) Test Questions and Answers in Telugu Model Paper -2


1. వాహనం నడుపుతున్నప్పుడు లైసెన్స్ వెంట తీసుకెళ్ళకపోతే?

  • (a) ఎటువంటి సమస్య లేదు

  • (b) జరిమానా విధిస్తారు ✅

  • (c) వాహనం సీజ్ చేస్తారు

2.  “Horn Prohibited” బోర్డు అంటే ఏమిటి?

  • (a) హారన్ కొట్టకూడదు ✅

  • (b) హారన్ తప్పనిసరిగా కొట్టాలి

  • (c) రాత్రివేళ మాత్రమే హారన్ కొట్టకూడదు

3.  రెండు చక్రాల వాహనం నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా ధరించాల్సింది ఏది?

  • (a) గ్లౌవ్స్

  • (b) హెల్మెట్ ✅

  • (c) గాగుల్స్

4.  వాహనం రోడ్డు ఎడమ వైపు నడపడం ఎందుకు ముఖ్యం?

  • (a) ప్రమాదాలు తగ్గడానికి ✅

  • (b) హారన్ వినిపించడానికి

  • (c) ట్రాఫిక్ సిగ్నల్ తప్పించుకోవడానికి

5. హైవేలో రివర్స్ డ్రైవ్ చేయవచ్చా?

  • (a) అవును

  • (b) కాదు ✅

  • (c) అవసరమైతే మాత్రమే

6.  రాత్రివేళ వాహనం నడుపుతున్నప్పుడు డిప్పర్ (Low Beam) ఎప్పుడు వాడాలి?

  • (a) వాహనం ఎదురుగా వస్తున్నప్పుడు ✅

  • (b) హైవేలో స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు

  • (c) ఎప్పుడూ వాడకూడదు

7. “No Entry” బోర్డు ఉంటే డ్రైవర్ ఏమి చేయాలి?

  • (a) అక్కడికి వెళ్లకూడదు ✅

  • (b) వేగం పెంచాలి

  • (c) హారన్ కొట్టి వెళ్లిపోవాలి

8. ఒకవేళ రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ మొదట చేయాల్సింది ఏమిటి?

  • (a) వాహనం పార్క్ చేసి తప్పించుకోవాలి

  • (b) గాయపడిన వారికి సహాయం చేయాలి ✅

  • (c) పోలీసులకు సమాచారం ఇవ్వకూడదు

9.  రోడ్డు మీద లైన్ లేకపోతే వాహనాలు ఎక్కడ నడపాలి?

  • (a) రోడ్డు కుడి వైపున

  • (b) రోడ్డు ఎడమ వైపున ✅

  • (c) రోడ్డు మధ్యలో

10.  వాహనం వెనుక నుండి “Ambulance” వస్తే ఏమి చేయాలి?

  • (a) ఆపి దారి ఇవ్వాలి ✅

  • (b) ముందుకు వెళ్లాలి

  • (c) స్పీడ్ పెంచాలి

11.  “Give Way” బోర్డు అర్థం ఏమిటి?

  • (a) ఇతర వాహనాలకు దారి ఇవ్వాలి ✅

  • (b) వాహనం ఆపాలి

  • (c) రివర్స్ వెళ్ళాలి

12. పిల్లలు రోడ్డుపై ఆడుకుంటున్నప్పుడు డ్రైవర్ ఏం చేయాలి?

  • (a) వేగం పెంచాలి

  • (b) జాగ్రత్తగా నడపాలి ✅

  • (c) హారన్ కొట్టాలి

13.  హైవేలో గరిష్ట వేగ పరిమితిని ఎవరు నిర్ణయిస్తారు?

  • (a) డ్రైవర్

  • (b) ప్రభుత్వం ✅

  • (c) వాహనం కంపెనీ

14. వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఎవరు జారీ చేస్తారు?

  • (a) RTA (Regional Transport Authority) ✅

  • (b) పోలీస్ స్టేషన్

  • (c) ట్రాఫిక్ కానిస్టేబుల్

15.  వాహనం బీమా లేకుండా నడిపితే ఏమవుతుంది?

  • (a) జరిమానా విధిస్తారు ✅

  • (b) ఎలాంటి సమస్య లేదు

  • (c) లైసెన్స్ ఇస్తారు

16. “Hospital Ahead” బోర్డు అర్థం ఏమిటి?

  • (a) అక్కడ ఆట స్థలం ఉంది

  • (b) అక్కడ ఆసుపత్రి ఉంది ✅

  • (c) అక్కడ రైల్వే స్టేషన్ ఉంది

17. వాహనం నడిపేటప్పుడు వెనుక అద్దం ఎందుకు ఉపయోగిస్తారు?

  • (a) వెనుక నుండి వచ్చే వాహనాలను చూడటానికి ✅

  • (b) అలంకరణ కోసం

  • (c) వేగం పెంచుకోవడానికి

18. మలుపు దగ్గర వాహనం నడుపుతున్నప్పుడు ఏం చేయాలి?

  • (a) వేగం తగ్గించాలి ✅

  • (b) వేగం పెంచాలి

  • (c) హారన్ వాయించకూడదు

19. డ్రైవింగ్ చేస్తూ మద్యం తాగితే ఏ శిక్ష ఉంటుంది?

  • (a) జరిమానా ✅

  • (b) బహుమతి

  • (c) శిక్ష ఉండదు

20. “Speed Breaker” బోర్డు అర్థం ఏమిటి?

  • (a) గరిష్ట వేగం

  • (b) స్పీడ్ తగ్గించాలి ✅

  • (c) వాహనం ఆపాలి

👉Previous Page                                       👉Next Page 

Comments